ఉభయగోదావరి జిల్లా పట్టభద్రుల ఎన్నికల్ల ప్రస్తుతం ముందజలో ఉన్న ఇళ్ల వెంకటేశ్వరరావు... తాను గెలిస్తే చేపట్టబోయే కార్యక్రమాలను వివరించారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అధ్యక్షుడిగా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, ప్రత్యేకంగా టీచర్ వృత్తిలో ఇబ్బందులు పడుతున్న ప్రతీవారికి అండగా ఉంటానని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల తీరు నేడు దిగజారిపోవడానికి కారణం ఉపాద్యాయుల్లో లోపిస్తున్న అభద్రతా భావమే అన్నారు. ఉపాధ్యాయులను పాఠశాలలకు కాకుండా ప్రభుత్వ కార్యకలాపాలకు, అంతర్జాల పనులకు పరిమితం చేసి విద్యార్ధికి తగు రీతిలో బోధనలు అందకుండా చేస్తున్నారన్నారు. డీయస్సీఉద్యోగాల విషయంలో ఎటువంటి ఆలోచనా... ముందస్తు ప్రణాళికా లేకుండా ఇష్టాగోష్టిగా ప్రవర్తిస్తున్నారన్నారు.విద్యాశాఖపై గాని, రాష్ట్ర విద్యార్ధి భవిష్యత్తుపై గాని ఎటువంటి పట్టింపులేకుండా ప్రవర్తించడమే ప్రధాన కారణమన్నారు. పింఛన్దారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులవిషయాల్లో చైతన్యం తీసుకురావడానికి కృషి చేస్తానని వెంకటేశ్వరరావు చెప్పారు.
ఇవి చదవండి