పశ్చిమ గోదావరి జిల్లా అచంటలో నియోజకవర్గంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పర్యటించారు. ఎన్నికల్లో గెలుపొందిన అనంతరం తొలిసారిగా ఆచంట, పెనుమంట్ర మండలాల్లోని ఆరు గ్రామాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. నియోజకవర్గంలోని 52 గ్రామాల్లో రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, మౌలిక సౌకర్యాలు మెరుగు పరిచేందుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అర్హులైన పేదలందరికీ నూటికి నూరుశాతం ఇళ్లు నిర్మించి ఇస్తామని తెలిపారు. త్వరలో నియామకం కాబోయే గ్రామవాలంటీర్ల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు.
ఇళ్లు కట్టిస్తాం... వసతులు కల్పిస్తాం: మంత్రి చెరుకువాడ - tour
పశ్చిమగోదావరి జిల్లా అచంట నియోజకవర్గంలో గృహ నిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పర్యటించారు. ఆయా గ్రామాల్లోని సమస్యలపై ఆరా తీశారు.
మంత్రి శ్రీరంగనాథరాజు