సంక్రాంతి రోజున మంత్రి కాన్వాయ్ ఢీకొని మృతి చెందిన వెంకటరామయ్య కుటుంబాన్ని శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత పరామర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమడోలులో మంత్రి కాన్వాయ్ ఢీకొట్టడంతో భీమవరానికి చెందిన కాళ్ళకూరి వెంకటరామయ్య మృతి చెందారు. వెంకటరామయ్య రిటైర్డ్ హెడ్ మాస్టర్. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ద్వారకాతిరుమల వెళుతుండగా భీమడోలులో ప్రమాదం జరిగింది. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. భీమవరంలో ఆయన కుటుంబాన్ని తానేటి వనిత పరామర్శించారు. ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
మృతుడి కుటుంబానికి మంత్రి తానేటి వనిత పరామర్శ - వెంకట్రామయ్య కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి తానేటి వనిత
భీమడోలులో మంత్రి కాన్వాయ్ ఢీకొట్టిన ఘటనలో భీమవరానికి చెందిన రిటైర్డ్ హెడ్ మాస్టర్ వెంకటరామయ్య మృతి చెందారు. అయితే ఆ కుటుంబాన్ని శిశుసంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పరామర్శించారు.
మృతుడి కుటుంబానికి మంత్రి తానేటి వనిత పరామర్శ
TAGGED:
minister taneti vanitha