ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ద్వారకా తిరుమల క్షేత్రాన్ని సందర్శించిన మంత్రి శ్రీ రంగనాథరాజు

By

Published : Jan 10, 2021, 2:16 PM IST

పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయాన్ని గృహ నిర్మాణ శాఖా మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు సందర్శించారు. బంగారు పూత తాపడం పెట్టిన ఆలయ ద్వారాలను ఆయన పరిశీలించారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

venkateshwara swamy temple in Dwarka
ద్వారకా తిరుమల క్షేత్రం

స్వర్ణ శోభితమైన శ్రీవారి ఆలయ ద్వారాల నిర్మాణ తీరును పరిశీలించేందుకు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామాత్యులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు ద్వారకా తిరుమల శ్రీవారి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ ఈవో డి.భ్రమరాంబ, అర్చకులు మర్యాదలతో ఆయనకు ఘనస్వాగతం పలికారు. ముందుగా శ్రీవారికి మొక్కులు సమర్పించారు. ప్రదక్షిణలు చేశారు. ఆ తర్వాత శ్రీవారి ముఖ ద్వారాల గుండా స్వామి, అమ్మవార్ల దర్శనం చేసుకున్నారు.

మంత్రి నేతృత్వంలో ఇటీవల గర్భాలయం ముఖ ద్వారం, తలుపులకు బంగారు రేకులతో తాపడం చేసే పనులను నిపుణులు చేపట్టారు. వివిధ దేవతా మూర్తుల డిజైన్లతో కూడిన బంగారు రేకులను గుమ్మాలు, తలుపులకు అమర్చారు. వాటిని వీక్షించిన మంత్రి రంగనాథరాజు తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. దర్శనానంతరం ఆలయ ముఖ మండపంలో ఆయనకు.. ఆలయ అర్చకులు స్వామి వారి శేష వస్త్రం కప్పి, వేద ఆశీర్వచనాలు అందించారు. స్వామి వారి జ్ఞాపిక, ప్రసాదాలను ఆలయ ఈవో భ్రమరాంబ అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details