అర్హులైన పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు కృషి చేస్తానని మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు పేర్కొన్నారు. ఆచంటకు వచ్చిన మంత్రికి నియోజకవర్గ ప్రజలు, వైకాపా శ్రేణులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు పునరావాస గ్రామాల్లో గృహ నిర్మాణాలు త్వరగా పూర్తి చేస్తామని హామీఇచ్చారు. జిల్లాలో తాగునీటి సమస్యను అధిగమించేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని వివరించారు.
ఆచంట అభివృద్ధికి కృషిచేస్తా: చెరుకువాడ
రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి... ఆచంటకు వచ్చిన చెరుకువాడ శ్రీ రంగనాథ రాజుకు ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు