రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వ ఆదేశాలకు లోబడి ప్రజలందరూ సంక్రాంతి పండుగను సంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవాలని అధికారులు ఆకాంక్షించారు. సంక్రాంతి పండుగకు కోడి పందేలు, జూదాలు నిర్వహించడం ఆనవాయితీగా మారిందని.. ప్రస్తుత పరిస్థితుల్లో వీటిని అదుపు చేసే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. మండల, గ్రామ స్థాయిలలో కమిటీలు వేసి వాటి ద్వారా కోడిపందాలు జూదాలు నిర్వహణకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేసినట్లు తణుకు తహసీల్దార్ ప్రసాద్ తెలిపారు. తణుకు పోలీస్ సర్కిల్ పరిధిలో సుమారు ఐదు వందల మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు సీఐ చైతన్య కృష్ణ వివరించారు.
కొవిడ్ కారణంగా నిబంధనలు అనుసరించవలసి ఉన్నందున ప్రతి ఒక్కరూ సహకరించాలని సంక్రాంతి పండుగను సుఖ సంతోషాలతో ఎవరి ఇళ్లలో వాళ్ళు జరుపుకోవాలని కోరారు. గ్రామ మండల స్థాయి అధికారులు ఉద్యోగులు ప్రజలు ఆటలు ముగ్గులు వంటి సంప్రదాయ పోటీలు నిర్వహించుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.