ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ద్వారకాతిరుమలలో మంత్రి రంగనాథరాజు ప్రత్యేక పూజలు - bhaktulu

ద్వారకాతిరుమలకు కాలినడకన వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పిస్తానని గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. ద్వారకా తిరుమల చిన వెంకన్నను శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

మంత్రి శ్రీరంగనాథరాజు

By

Published : Jun 9, 2019, 8:25 AM IST

ద్వారకాతిరుమలలో మంత్రి రంగనాథరాజు ప్రత్యేక పూజలు

రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు శనివారం ద్వారకాతిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి, అమ్మవార్లకు మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు సేవ చేసుకునే అవకాశాన్ని స్వామి వారు తనకు కల్పించారన్నారు. నిత్యాన్నదానం నిర్వహణకు తనవంతు సాయం అందించినట్లు చెప్పారు. శని ,ఆదివారాల్లో భక్తులు స్వామివారి దర్శనం కోసం కాలినడకన పెద్ద సంఖ్యలో వస్తున్నారని చెప్పారు. భక్తులు ఆ సౌకర్యాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. స్వామివారి అనుగ్రహంతో కాలినడకన వచ్చే భక్తులకు కూడా మూడు ,నాలుగు కిలోమీటర్ల దూరం వ్యవధిలో విశ్రాంతి తీసుకునేందుకు వసతి, తాగునీరు, మరుగుదొడ్లు, అన్నదానం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. త్వరలోనే భీమడోలు నుంచి ద్వారకాతిరుమలకు, తోబచర్ల నుంచి ద్వారకాతిరుమల మార్గాల్లో సౌకర్యాలను తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేస్తానని తెలిపారు. 50 నుంచి 100 మంది భక్తులకు సరిపడా విధంగా ఒకే చోట తాగడానికి నీరు, విశ్రాంతి తీసుకోవడానికి వసతి, స్నానాలకు అవసరమైన కుళాయిలు, భోజనాలు వంటి సౌకర్యాలను కల్పిస్తామని చెప్పారు. గృహ నిర్మాణ శాఖ ద్వారా పేద ప్రజలకు ఇళ్లు నిర్మించి ఇచ్చే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details