పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ పోలీసులు ఓ మహిళ దొంగను అరెస్టు చేశారు. బస్సులలో ప్రయాణికుల ఆభరణాలు చోరీ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఆరు తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. జులై 22వ తేదీన పెనుగొండ నుంచి నరసాపురం వెళుతున్న బస్సులో ఆభరణాలు చోరీకి గురి కావడంతో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పెనుగొండ మండలం దొంగరావిపాలెం వద్ద తనిఖీలు చేస్తుండగా తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నాగళ్ల రమణ అనే మహిళ పట్టుబడింది. ఆమె నుంచి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిని కోర్టులో హాజరు పరచనున్నట్టు పోలీసులు తెలిపారు.
పోలీసులకు పట్టుబడ్డ మహిళ దొంగ - police
బస్సుల్లో ప్రయాణికుల వద్ద అభరణాలు చోరీ చేస్తున్న మహిళను పెనుగొండ పోలీసులు అరెస్టు చేశారు.
మహిళ దొంగ అరెస్టు