ఈనెల 16న కృష్ణా జిల్లా నందిగామ పల్లగిరి గట్టు మీద ఆత్మహత్యకు ప్రయత్నించిన ప్రేమజంటలో.. ప్రియురాలు ఈరోజు మృతిచెందింది. పెనుగంచిప్రోలు మండలం నవాబుపేటకు చెందిన సత్యనారాయణ, నిడమానూరుకు చెందిన దివ్యశ్రీ గత రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. దివ్యశ్రీకి ఆమె తల్లిదండ్రులు ఈనెల 25న పెళ్లి నిశ్చయించారు. ఇష్టం లేని పెళ్లి చేసుకోలేక 16వ తారీఖున ప్రియుడి దగ్గరికి వెళ్లింది. అనంతరం వారివురూ పురుగుమందు తాగగా.. గమనించిన స్థానికులు నందిగామ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స తర్వాత మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఈరోజు దివ్యశ్రీ మరణించగా, సత్యనారాయణ పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఆత్మహత్యకు యత్నించిన ప్రేమజంట.. ప్రియురాలు మృతి - ప్రియురాలు
వారిద్దరూ ప్రేమించుకున్నారు. కలిసి బ్రతకలేక... కలిసి చావాలనుకున్నారు. పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో ప్రియురాలు మృతిచెందగా.. ప్రియుడు ప్రాణాలతో పోరాడుతూ.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఆత్మహత్యకు యత్నించిన ప్రేమజంట.. ప్రియురాలు మృతి