పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం లక్ష్మీపురం వద్ద పోలవరం కుడి కాలువ గట్టు మట్టి అక్రమ తవ్వకాలను గ్రామస్తులు అడ్డుకున్నారు. ప్రతి రోజు రాత్రి.. భారీ స్థాయిలో మట్టి తవ్వకాలు జరుగుతున్నట్లు.. తెలుసుకున్న గ్రామస్తులు రాత్రికి కాపుకాసి తవ్వకాలు నిలుపుదల చేశారు. అనంతరం పోలీసులకు నిలుపుదల చేశారు. 2 పొక్లెయిన్లు, 2 టిప్పర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అధికార పార్టీ నాయకులు మట్టి తవ్వకాలు నిర్వహిస్తున్నందున.. అధికారులు నోరు మెదపడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
యథేచ్ఛగా పోలవరం కుడికాలువ మట్టి అక్రమ రవాణా.. అడ్డుకున్న స్థానికులు - west godavari
పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం వంగూరు సమీపంలోని పోలవరం కుడి కాల్వ గట్టు వద్ద మట్టి అక్రమ తవ్వకాలను స్థానికులు అడ్డుకున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో 2 పొక్లెయిన్లు, 2 టిప్పర్లు స్వాధీనం చేసుకున్నారు.
locals obstruct polavaram right canal mud digging process