ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దిల్లీ రైతు ఉద్యమానికి సంఘీభావంగా తణుకులో దీక్ష - west godavari news

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో వామపక్ష నేతలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. దిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతు తెలిపారు. 33 మంది అన్నదాతలు ప్రాణాలు కోల్పోయినా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవటం దారుణమని అన్నారు. నూతన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

Left parties dharna
తణుకులో దీక్ష

By

Published : Dec 23, 2020, 7:31 PM IST

దిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా పశ్చిమగోదావరి జిల్లా తణుకులో వామపక్షాలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ప్రధాన రహదారిలోని గాంధీ విగ్రహం వద్ద వామపక్షాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు రిలే దీక్షలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి, చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దిల్లీలో లక్షలాది మంది రైతులు చేస్తున్న ఉద్యమం 27రోజులకు చేరుకుందని తెలిపారు. 33 మంది అన్నదాతలు ప్రాణాలు కోల్పోయారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. నూతన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దిల్లీ రైతులకు మద్దతుగా ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details