ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోట్ల విలువైన భూమి పేదలకిచ్చేసింది! - కస్తూరి

పుట్టిన గడ్డకు సేవ చేయాలన్న ఆలోచన.. పేదలకు గూడు కల్పించాలన్న సదాశయంతో ఉదారతను చాటుకున్నారు పశ్చిమగోదావరిజిల్లా పెనుమంట్ర మండలం నత్తారామేశ్వరం గ్రామానికి చెందిన పడాల కస్తూరి. కోట్ల రూపాయల విలువచేసే భూమిని పేదలకు ఇళ్ల స్థలాలుగా పంచి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

land_given_to_poor_people_freely

By

Published : Jun 16, 2019, 1:40 PM IST

Updated : Jun 16, 2019, 4:30 PM IST

ఈ అమ్మ మనసు వెన్న...కోట్ల విలువ చేసే భూమి పేదలకు ఇచ్చేసింది!
కస్తూరి కుటుంబసభ్యులు యాభై ఏళ్ల కిందటే లండన్​లో స్థిరపడ్డారు. ఆర్థికంగా పురోగతి సాధించటంతో తమ స్వగ్రామమైన నత్తారామేశ్వరం ప్రజలకు వీలున్నంత మేలు చేస్తూనే వచ్చారు. వారికి గ్రామం మధ్యలో సుమారు ఏడు కోట్ల రూపాయల విలువైన ఎకరం పది సెంట్ల భూమి ఉంది. దానిని కస్తూరి తనకుమారుడు దివంగత కనికిరెడ్డి పేరిట ప్రభుత్వానికి విరాళంగా అందజేశారు. పేదవారికి గృహవసతి కల్పించేలా చర్యలు తీసుకోవాలని కస్తూరి మంత్రి రంగనాథరాజును కోరారు. తమకు కలిగిన దానిలో పేదవారికి మేలు చేయాలన్న ఉద్దేశ్యంతోనే భూవిరాళమిచ్చినట్టు కస్తూరి తెలిపారు.
Last Updated : Jun 16, 2019, 4:30 PM IST

ABOUT THE AUTHOR

...view details