పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం కొవ్వలి సచివాలయంలో నాలుగేళ్లుగా తాగునీరు రాక ఇబ్బంది పడుతున్నామని స్థానిక మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని వాపోయారు. నీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. మహిళలు బిందెలతో సచివాలయంలో ప్రవేశించి బైఠాయించారు.
స్థానిక బీసీ కాలనీకి చెందిన మహిళలు కొంత కాలంగా తాగునీరు సక్రమంగా అందడం లేదన్నారు. పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారానికి నోచుకోలేదన్నారు. నాలుగేళ్లుగా అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.