ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

క్వారంటైన్ కేంద్రంలో ఖాళీ లేదు... రోడ్డు మీదే రోగులు..! - west godavari district latest news

కరోనా సోకితే క్వారంటైన్​కి వెళ్లాలంటారు. కానీ పశ్చిమగోదావరి జిల్లాలో క్వారంటైన్ సెంటర్​కి వెళ్తే కష్టాలు ఎదురయ్యాయి. అధికారుల పాపమో.. సమన్వయ లోపమో.. తెలియదుగానీ పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సెంటర్ వద్ద కరోనా బాధితులు అర్ధరాత్రి వరకు వేచి చూడాల్సి వచ్చింది.

lack-of-coordination-between-authorities-curse-for-kovid-victims
రోడ్డు మీదే రోగులు

By

Published : Jul 23, 2020, 12:24 AM IST

Updated : Jul 23, 2020, 1:57 AM IST

పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా రోగులను క్వారంటైన్​కు తరలించే విషయంలో.. అధికారుల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపించింది. కరోనా సోకిన వారు తీవ్రంగా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. తాడేపల్లిగూడెం క్వారంటైన్ సెంటర్లో అర్ధరాత్రి వరకు..ఆకలితో రోడ్డుపై నిలుచోవాల్సి వచ్చింది జిల్లాలోని ఏలూరు సి.ఆర్.రెడ్డి కళాశాలలో... తాడేపల్లిగూడెంలో పట్టణ పేదలకు నిర్మించిన గృహ సముదాయంలో జిల్లాస్థాయి క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. రెండు మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. వందల సంఖ్యలో కేసులు వస్తుండడంతో ఏలూరు సెంటర్ పూర్తిగా నిండి పోయింది. తాడేపల్లిగూడెం కేంద్రంపై ఒత్తిడి పెరిగింది.

బస్సులో ఉన్న రోగులు

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రైవేట్ పాఠశాలల బస్సుల్లో పాజిటివ్​గా తేలిన వ్యక్తులను తాడేపల్లిగూడెం క్వారంటైన్ సెంటర్​కు తీసుకువచ్చారు. అప్పటికే అక్కడ ఏర్పాట్లు చేసిన మేరకు గదులు నిండిపోయాయి. బుధవారం మధ్యాహ్నం నుంచి గదులు కేటాయింపులో బాగా ఆలస్యం జరిగింది. దీంతో కొవిడ్ బాధితులు రోడ్లపైనే పడిగాపులు కాశారు. సాయంత్రానికి అక్కడకు చేరుకున్న వారికి.. అర్ధరాత్రి వరకు కూడా గదులు ఇవ్వలేదు. "గదులు ఖాళీ లేవు.. తిరిగి వెళ్లిపోవాలని" అక్కడి పోలీసు సిబ్బంది చెప్పారని బాధితులు ఆరోపించారు. మధ్యాహ్నం ఇంటినుంచి బయలుదేరిన వీళ్లకు అర్ధరాత్రి వరకు కూడా భోజనం పెట్టలేదు. బాధితుల్లో ఎక్కువ మంది వృద్ధులు ఉండగా.. కొందరు పిల్లలు కూడా ఉన్నారు. వీరంతా ఆకలితో ఇబ్బందులు పడ్డారు. అర్ధరాత్రి దాటిన తర్వాత వీళ్లకు రూములు కేటాయించి.. భోజనం ప్యాకెట్లు ఇచ్చారు.

ఇదీ చదవండీ... చీరాలలో దళిత యువకుడు మృతి....దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశం

Last Updated : Jul 23, 2020, 1:57 AM IST

ABOUT THE AUTHOR

...view details