ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. నామినేషన్ దాఖలు చేయడానికి ఆలస్యంగా వచ్చినందున రిటర్నింగ్ అధికారి, ఆయన నామినేషన్ను తిరస్కరించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేసేందుకు కేఏ పాల్, 4 గంటల తర్వాత వచ్చారు. తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. నామినేషన్కుసమయం మించిపోయిందంటూ...రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. తన ప్రతినిధి 2 గంటలముందే తహసీల్దార్ కార్యాలయంలో ఉన్నాడని.. తాను ఆలస్యంగా వచ్చినా... నామినేషన్స్వీకరించాలని వాదనకు దిగారు. నిబంధనల మేరకు నామినేషన్ స్వీకరించలేమని అధికారుల తేల్చి చెప్పారు.