నరసాపురంలో జనసేన అభ్యర్థి నాగబాబు పర్యటన - NARASPURAM
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో... జనసేన నాయకుడు, నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి నాగబాబు పర్యటించారు. నియోజకవర్గంలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు తెలుసుకున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో... జనసేన ఎంపీ అభ్యర్థి నాగబాబు పర్యటించారు. నియోజకవర్గంలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను తెలుసుకున్నారు. వశిష్ట గోదావరి తీరాన్ని, బియ్యపు తిప్ప గ్రామంలో ఫిషింగ్ హార్బర్ నిర్మస్తామని చెబుతున్న ప్రదేశాన్ని, గోదావరిలో కలిసిపోతున్న డంపింగ్ యార్డును సందర్శించారు. నరసాపురం లోక్సభ నియోజకవర్గంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలపై అవగాహన పెంచుకున్నట్టు నాగబాబు తెలిపారు. తాను గెలిచిన వెంటనే నరసాపురం ప్రజల చిరకాల వాంచ అయినా వశిష్ట బ్రిడ్జి, గోదావరి నీటిని కలుషితం చేస్తున్న డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరిస్తానన్నారు. మత్స్యకారుల కోసం ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తానని చెప్పారు. ఆయన వెంట నరసాపురం జనసేన అసెంబ్లీ అభ్యర్థి బొమ్మిడి నాయకర్, ఆ పార్టీ సీనియర్ నాయకులు డా. చినిమిల్లి సత్యనారాయణ, పార్టీ నాయకులు ఉన్నారు.