ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప.గో. జిల్లాలో జనసేన సమీక్ష సమావేశాలు... - ఏలూరు

ప్రజలకు సేవ చేయాలన్న ఏకైక లక్ష్యంతోనే పవన్​కల్యాణ్ జనసేన పార్టీ స్థాపించారని పశ్చిమగోదావరి జిల్లాలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో కొణెదల నాగబాబు అన్నారు.

కుటుంబంలా కలిసి ఉండేందుకే సమీక్ష కార్యాక్రమాలు

By

Published : Sep 12, 2019, 12:28 PM IST

కుటుంబంలా కలిసి ఉండేందుకే సమీక్ష కార్యాక్రమాలు
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు గోకుల్ కళ్యాణ మండపంలో జనసేన కార్యాకర్తల సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశానికి జనసేన పార్టీ ఉభయగోదావరి జిల్లాల సమన్యయకర్త కొణెదల నాగబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కార్యాకర్తల అభిప్రాయాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత ఎన్నికల్లో జరిగిన పరిణామాలు, రాబోయే స్థానిక సమస్యలను కార్యాకర్తలతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయటానికే పవన్ పార్టీ స్థాపించారని అన్నారు. పార్టీ సమావేశాలు కేవల సమావేశాలుగా చూడకుండా ఒక కుటుంబంగా ఉండాలనే సమీక్షలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పవన్​కు పార్టీ అధినేతగా ఎన్నో కార్యాక్రమాలు ఉన్నందునే అందర్నీ కలవటం కుదరనీ, అయినప్పటకీ ప్రతి కార్యాకర్తలకు మనో ధైర్యం కలిగించాలని సూచించారు. పార్టీ బలోపెతానికి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details