తెలంగాణకు జయరాం హత్య కేసు - telengana
జయరాం హత్యకేసును ఆంధ్రా పోలీసులు తెలంగాణకు బదిలీ చేశారు. ఘటన జరిగింది తెలంగాణ లో కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. జూబ్లీహిల్స్ పోలీసులకు భార్య పద్మశ్రీ ఫిర్యాదు చేశారు.
ప్రముఖ పారిశ్రమికవేత్త జయరాం హత్యకేసును ఆంధ్రా పోలీసులు తెలంగాణకు బదిలీ చేశారు. ఘటన జరిగింది తెలంగాణ లో కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ సిటీ పోలీసులకు బదిలీ చేస్తున్నట్లు డీజీపీ ఠాకూర్ తెలిపారు. జూబ్లీహిల్స్ పోలీసులకు జయరాం భార్య పద్మశ్రీ ఫిర్యాదుతో ఈ నిర్ణయం తీసుకున్నారు. హత్యకేసును తెలంగాణ పోలీసులు విచారణ జరపాలని పద్మశ్రీ కోరారు.
ఆర్థిక లావాదేవిలే ఈ హత్యకు కారణమని తాజాగా పోలీసులు తేల్చారు. రాకేశ్ రెడ్డి, వాచ్మెన్ శ్రీనివాస్‌తో కలిసి ఈ హత్య చేసినట్లు కృష్ణా జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ తెలిపారు. హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రించడానికి మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి విజయవాడకు తీసుకొచ్చారు. నందిగామ దగ్గర మృతదేహంతో పాటు కారును వదిలేసి వెళ్లిపోయాడు.