ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అసంఘటిత కార్మికులను ఆదుకోవాలంటూ ఐఎఫ్​టీయూ ధర్నా

కరోనా ప్రభావం వల్ల ఉపాధి కోల్పోయిన సంఘటిత, అసంఘటిత కార్మికులను కేంద్రం ఆదుకోవాలంటూ ఏలూరులో ఐఎఫ్​టీయూ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ప్రతి కుటుంబానికి నెలకు రూ.10 వేల చొప్పున కేంద్ర ప్రభుత్వం చెల్లించాలంటూ ఐఎఫ్​టీయూ నాయకులు డిమాండ్​ చేశారు.

By

Published : Jun 28, 2020, 6:40 AM IST

iftu protest at eluru to help organised and unorganised sector people by centre
ఏలూరులో ఐఎఫ్​టీయూ ధర్నా

కరోనాను అడ్డం పెట్టుకుని కేంద్రం కార్మిక చట్టం రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ... పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఐఎఫ్​టీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కొవిడ్​-19 వల్ల సంఘటిత, అసంఘటిత కార్మికులందరూ ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారంటూ ఐఎఫ్​టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. గత 20 రోజులుగా పెట్రోల్​, డీజిల్​ ధరలను పెంచి... ప్రజలపై ఆర్థిక భారం మోపడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వం సంఘటిత, అసంఘటిత కార్మికులకు ఒక్కో కుటుంబానికి నెలకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం చేయాలని డిమాండ్​ చేశారు.

ABOUT THE AUTHOR

...view details