పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని గిరిజన భవన్లో... జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ హాజరై మాట్లాడారు. మత సామరస్యానికి రంజాన్ పండుగ ప్రతీక అని పేర్కొన్నారు. పవిత్ర రంజాన్ అందరికీ మంచి చేకూర్చాలని ఆకాంక్షించారు. ఉపవాస దీక్ష కారణంగా ఆధ్యాత్మిక చింతనతోపాటు... శాస్త్రీయమైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని వివరించారు.
మత సామరస్యానికి రంజాన్ పండుగ ప్రతీక: కలెక్టర్ - రంజాన్
రంజాన్ పురస్కరించుకుని ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీ, పలు శాఖల అధికారులు, ముస్లిం మతపెద్దలు హాజరయ్యారు.
ఇఫ్తార్ విందు