పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో నిర్వహించిన రోడ్‌షోలో జగన్, కేసీఆర్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 'కేసీఆర్ సచివాలయానికి కూడా వెళ్లరు. ఏ పని చేయని కేసీఆర్‌కి అన్ని సీట్లు వస్తే... నిత్యం ప్రజల్లో ఉండే మనకెన్ని రావాలి. తెలంగాణ ముఖ్యమంత్రితో జగన్ కుమ్మక్కై రాష్ట్రంలో కుట్రలకు పాల్పడుతున్నారు. వైకాపా నేతలకు తెరాస డబ్బులిస్తోంది. ఒక్క ఓటుకు 5 వేల రూపాయలు ఇస్తానంటుందిప్రతిపక్ష పార్టీ... వాళ్లకు ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? జగన్‌కి కేసీఆర్ పెట్టుబడి పెడుతున్నాడు' అని సీఎం ఆరోపించారు.గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్లు కూడా..ఈసారి వైకాపాకు రాకూడదనిఅన్నారు.వైకాపాకు ఓటు వేస్తే ఆంధ్రులపై కేసీఆర్ పెత్తనం వస్తుందని అన్నారు. జగన్కుఅవకాశం ఇస్తే మరణశాసనం రాసుకున్నట్లేనని విమర్శించారు. రాష్ట్ర ప్రజలపై తెలంగాణ పెత్తనం రాకూడదంటే జగన్‌కి ఓటేయకూడదని సూచించారు.