పశ్చిమగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. జిల్లా కేంద్రమైన ఏలూరులో కుండపోత వర్షంతో రహదారులు జలమయమయ్యాయి. కలెక్టరేట్, ఫైర్ స్టేషన్ సెంటర్, ఆర్టీసీ బస్టాండు, పాతబస్టాండు ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచింది. దాదాపు రెండు గంటలపాటు కురిసిన వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో నీరు నిలవడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
పశ్చిమగోదావరి జిల్లాలో భారీ వర్షం..రహదారులన్నీ జలమయం - water flow
పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఏలూరులో కుండపోత వర్షం పడింది.
ఏలూరు