ఆచంటలో ఎడతెరిపి లేకుండా వర్షం - rain
పశ్చిమగోదావరి జిల్లాను వరుణుడు పలకరించాడు. జిల్లాలోని ఆచంట మండలంలోని పలు చోట్ల ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది.
'ఆచంటలో ఎడతెరిపి లేకుండా వర్షం'
పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఇన్ని రోజులు తీవ్ర ఎండలతో ఇబ్బంది పడిన ప్రజలకు కాస్త ఊరట లభించింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడి.. ఆహ్లాదకరంగా మారింది. సాగుకు సిద్ధమవుతోన్న రైతన్నలు.. అనుకోని అతిథిలా వచ్చిన వానల వల్ల మేలు జరుగుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.