పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వైద్యఆరోగ్య శాఖ జిల్లా అధికారులతో మంత్రి ఆళ్ల నాని సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా మంత్రులు శ్రీరంగనాథరాజు, తానేటి వనిత, వైద్యఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జిల్లాలోని వైద్యశాఖలో నెలకొన్న సమస్యలపై సమీక్షించారు. వాటి పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. రాష్ట్ర బడ్జెట్లో సింహభాగం వైద్యఆరోగ్యశాఖకు కేటాయించి.. నిరుపేదలకు వైద్యం చేరువ చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని మంత్రి అన్నారు. వైద్యుల కొరత, మౌళిక వసతుల లేమి, మరిన్ని ఆస్పత్రుల ఏర్పాటు వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని తెలిపారు.
మారుమూల ప్రాంతాలకూ.. మెరుగైన వైద్యం: ఆళ్ల నాని - west godavari
మారుమూల ప్రాంతాలకు సైతం మెరుగైన వైద్యం అందించటమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి ఆళ్ల నాని తెలిపారు.
ఆళ్లనాని