పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని సర్ సీఆర్ రెడ్డి అటానమస్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ డే ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదికవి నన్నయ్యవిశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఏవీ ప్రసాద్ రావు హాజరయ్యారు. డిగ్రీ పట్టాలు అందుకున్న వారు నిత్యం హార్డ్ వర్క్ చేయాలని... ప్రతి విషయంపై అవగాహన పెంచుకోవాలని ఆయన సూచించారు. తల్లిదండ్రులను ప్రేమించాలని విద్యార్థులకు ప్రసాద్ రావు దిశానిర్దేశం చేశారు. అన్ని రంగాల్లోనూ సాంకేతికత వేగంగా విస్తరిస్తోందని.... డిగ్రీ విద్యార్థులు సాఫ్ట్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్‌లో నిపుణత సాధించి ఉద్యోగాలు పొందాలని సూచించారు.
సీఆర్‌రెడ్డి డిగ్రీ కళాశాలలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సర్ సీఆర్‌రెడ్డి అటానమస్ డిగ్రీ కళాశాలలో గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు. 2015 -18, 2016 -19 బ్యాచ్‌లకు చెందిన బీఏ, బీకాం,బీఎస్సీ కోర్సుల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు స్వర్ణ పతకాలను ఆదికవి నన్నయ్యవిశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఏవీ ప్రసాద్ రావు బహుకరించారు.
ఏలూరు సర్ సీఆర్‌రెడ్డి డిగ్రీ కళాశాలలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే