2018 ఖరీఫ్ సీజన్లో ఆగస్టు నవంబర్ నెలలో పశ్చిమ గోదావరి జిల్లాలో 64 వేల 867 ఎకరాల పంట అధిక వర్షాల వల్ల నష్టపోయినట్టు అధికారులు వెల్లడించారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు పరిధిలో రుణాలు తీసుకున్న 5 వేల 5 వందల 86 మంది రైతులకు.. 4 కోట్ల 32 లక్షల 89 వేల 80 రూపాయల పంట నష్టపరిహారం విడుదలైనట్లు వివరించారు. ఈ మెుత్తాన్ని హెచ్డీఎఫ్సీ ఎర్గో ఇన్సూరెన్స్ కంపెనీ... జిల్లా సహకార బ్యాంకుల ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేసింది.
బీమా పరిహారం అత్యధికంగా తాడేపల్లిగూడెం ప్రధాన శాఖ పరిధిలో.. 15 వందల 28 మంది రైతులకు గాను, 2 కోట్ల 10 లక్షల 62వేల 770 రూపాయలు విడుదలయ్యాయి. అత్యల్పంగా భీమవరం బజార్ శాఖ పరిధిలో ఇద్దరు రైతులకు, 29, 222 రూపాయల పరిహారం విడుదలైనట్లు తెలిపారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు తణుకు శాఖ పరిధిలో ఉన్న 12 వ్యవసాయ పరపతి సహకార సంఘాలకు చెందిన 372 మంది రైతులకు.. 18 లక్షల 58 వేల 4 వందల ఎనిమిది రూపాయలు విడుదలైందని ఆ సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేస్తామని బ్రాంచ్ మేనేజర్ అజయ్ కుమార్ తెలిపారు.