గోదావరి వరద ప్రభావంతో పశ్చిమగోదావరి జిల్లా పెరవలి, నిడదవోలు, పెనుగొండ మండలాల పరిధిలోని లంక భూముల్లో పంటలకు నష్టం ఏర్పడింది. కంద, పచ్చిమిర్చి తోటలు, కూరగాయ పంటలు నీళ్లలో మునిగిపోయాయి. ముఖ్యంగా అరటి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఎక్కువ నీటిలో నానడం వల్ల అరటి పిలకలు మురిగిపోయాయి. అక్కడక్కడ నీరు తగ్గినా.. ఇంకా చాలాచోట్ల పంటలు నీళ్లలోనే ఉన్నాయి. ఒక్కొక్క ఎకరానికి యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టామనీ.. ఆ డబ్బంతా బూడిదలో పోసిన పన్నీరైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గోదావరి వరద.. పంటలకు తీవ్ర నష్టం - నిడదవోలు
గోదావరి వరదకు పశ్చిమగోదావరి జిల్లాలో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చాలాచోట్ల పొలాల్లోని పంటలు పనికిరాకుండా పోయాయి. అరటి, కంద, పచ్చిమిర్చి, కూరగాయ పంటలు వేసిన రైతులు నష్టపోయారు.
గోదావరి వరదతో పంటలకు తీవ్ర నష్టం