పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజగకవర్గంలోని కోడేరు, భీమలాపురం వద్ద గోదావరి వరద నీరు పోటెత్తింది. అయోధ్యలంక, పుచ్చల్లంక, రావిలంక, మర్రిమూల తదితర గ్రామాల్లో నీరు చేరింది. అరటి తోటలు, కూరగాయ తోటలు నీటమునిగాయి. వరద ఉద్ధృతి పెరగటంతో అధికారులు నాటు పడవలను నిషేధించారు. లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముంపు అధికంగా ఉన్న గ్రామ ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.
పోటెత్తుతున్న గోదావరి వరద.. లంక గ్రామాలు విలవిల - పశ్చిమగోదావరి జిల్లా గోదావరి వరదలు
గోదావరి వరద నీరు పోటెత్తటంతో లంక గ్రామాలు అల్లాడుతున్నాయి. తోటలు, పొలాలు నీటమునగగా.. ఇళ్ల దరిదాపుల్లోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
గోదావరి వరదలు