పశ్చిమగోదావరి జిల్లా పెరవలి మండలం నల్లకులవారిపాలెం వద్ద కారులో తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 21.5 కేజీల గంజాయిని పట్టుకున్నారు. విశాఖ నుంచి విజయవాడ వెళ్తున్న కారు నల్లకులవారిపాలెం వద్ద ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి ఆగిపోయింది. పోలీసులు కారును పరిశీలించగా గంజాయి లభ్యమైంది. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. కేరళకు తరలిస్తున్నట్టు నిందితులు అంగీకరించారు.
కారులో తరలిస్తున్న గంజాయి స్వాధీనం - arrest
పశ్చిమగోదావరి జిల్లా నల్లకులవారిపాలెం వద్ద కారులో తరలిస్తున్న 21.5 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గంజాయి పట్టివేత