ఉభయ గోదావరి జిల్లాల్లో వరద బాధితులకు ఉచితంగా నిత్యావసర సరుకులు అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. 25 కిలోల బియ్యంతో పాటు మొత్తం ఆరు రకాల సరుకులు అందించాలని అధికారులకు స్పష్టం చేసింది. ఈ మేరకు రెండు జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ వరదల కారణంగా వారానికి పైగా జలమయమైన ప్రాంతాల్లోని కుటుంబాలకు ఈ ఉచిత రేషన్ అందించాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఉభయ గోదావరి జిల్లాల వరద బాధితులకు ఉచిత రేషన్ - ఉభయగోదావరి జిల్లాల వార్తలు
వరదల కారణంగా నష్టపోయిన ఉభయగోదావరిజిల్లాల ప్రజలకు ఉచితంగా నిత్యావసర సరుకులు అందించాలని...రెండు జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఉభయ గోదావరి జిల్లాల్లో వరద బాధితులకు ఉచిత రేషన్
ఇప్పటికే వరదముంపులో చిక్కుకున్న కుటుంబాలకు తక్షణ సాయంగా ప్రభుత్వం రెండు వేల రూపాయల ఆర్ధికసాయాన్ని ప్రకటించింది. త్వరితగతిన బాధితులను గుర్తించి వారికి ఈ ఆర్దిక సాయం అందించాలని ప్రభుత్వం తెలిపింది.
ఇదీ చదవండి:వరద నీటిలోనే గ్రామాలు... నిత్యావసరాల కోసం ప్రజలు పాట్లు