ధాన్యం కొనుగోలు కేంద్రాలలో సమస్యలు పరిష్కరించాలని పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామంలో రైతులు ధర్నా చేపట్టారు. జాతీయరహదారిపై బైఠాయించి నిరసన తెలియజేశారు. ధాన్యం కొనుగోలులో జాప్యం జరుగుతోందని, సంచులకు అధికంగా డబ్బు వసూలు చేస్తున్నారని వాపోయారు. ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గోనెసంచి బరువు ఆరువందల గ్రాములుంటే కిలో వరకు తూకంలో తగ్గిస్తున్నారని ఆరోపించారు. తమకు గిట్టుబాటు ధర కల్పించాలని, ధాన్యం కొనుగోలు వెంటనే జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సమస్యల పరిష్కారానికి రోడ్డెక్కిన రైతు - duvva
పశ్చిమగోదావరి జిల్లాలో తమ సమస్యలు పరిష్కరించాలంటూ రైతులు జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. ధాన్యం కొనుగోలులో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు.
సమస్యల పరిష్కారానికి రోడ్డెక్కిన రైతన్నలు