ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వెలుగుల వేంగినగరం.. కళ తప్పింది...! - capital

శతాబ్దాల ఆంధ్రుల చరిత్రలో రాజధానిగా వెలిగి.. ఎందరో కవులు, కళాకారులు, రాజులకు నిలయమైన వేంగినగరం.. ప్రస్తుతం పెదవేగిగా పేరు మార్చుకుంది. ఆనాటి స్మృతులు,  చిహ్నాలకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్న ఈ ప్రాంతం.. ఇప్పుడు నిరాదరణకు గురవుతోంది. నాటి వేంగి... నేటి పెదవేగి.. ప్రస్తుత స్థితిపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

వెలుగుల వేంగినగరం..కళతప్పింది...!

By

Published : Sep 5, 2019, 5:23 PM IST

వెలుగుల వేంగినగరం..కళతప్పింది...!

ఒకప్పటి ఆంధ్రుల రాజధానిగా.. వేంగి నగరంగా వెలుగొందిన ఈ పట్టణం ప్రభ.. ఇప్పుడు మసకబారింది. పెదవేగిగా పేరు మారి.. అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచింది. గతమెంతో ఘనం అన్న మాటకు.. అచ్చమైన నిదర్శనంగా నిలుస్తూ.. ఆ నాటి వైభం కాలగర్భంలో కలిసిపోయింది. వేంగి నగరం..వందల ఏళ్లు రాజధానిగా ఉన్నట్లు... ఆనాటి ఆనవాళ్లు ఇప్పటికీ చెబుతున్నాయి. మూడో శతాబ్దంలో శాలంకాయన రాజులు.. వేంగినగరాన్ని తమ రాజధానిగా చేసుకొని పాలించారు. తర్వాత కాలంలో వేంగిచాళుక్య రాజులు ఇదే నగరాన్ని రాజధానిగా చేసుకొన్నారు. వారి వంశానికి చెందిన రాజరాజనరేంద్రుడు..10వ శతాబ్దంలో తమ రాజధానిని వేంగినగరం నుంచి రాజమహేంద్రవరానికి మర్చారు. అప్పటి నుంచి వేంగినగర కళ తప్పింది. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలోని పెదవేగి మండల కేంద్రంగా నిలిచింది. ఈ పెదవేగి పట్టణమే.. ఒకప్పటి వేంగినగరమని చరిత్రకారులు సాధించిన ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. పెదవేగిలో అప్పటి పాలనకు సంబంధించిన అనేక అవశేషాలు, ఆనవాళ్లు ఇప్పటికీ మిగిలే ఉన్నాయి. మరిన్ని వివరాలను.. పెదవేగి నుంచి ఈటీవీ భారత్ ప్రతినిధి అందిస్తారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details