వరలక్ష్మీ వ్రతం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం కాకరపర్రులోని పూలమార్కెట్ లో పూలధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గతంలో కిలో రూ. 100 నుంచి రూ.150 లకు మించని పువ్వుల ధర.. ఇప్పడు ఏకంగా రూ. 500 నుంచి రూ.1000 పైగా పలుకుతోంది. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పూల తోటలు కుళ్లిపోయి దిగుబడులు తగ్గడమూ.. ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు అంటున్నారు. అంతేగాక ఎక్కవగా అమ్మడయ్యే చామంతిని బెంగుళూరు నుంచి దిగుమతి చేసుకుంటున్నట్టు చెప్పారు.
శ్రావణం ప్రభావం.. ఆకాశాన్ని తాకిన పూల ధరలు - west godavari district
శ్రావణ మాసం ప్రారంభంతో పూలధరలు అమాంతం పెరిగాయి. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు పూల దిగుబడి తగ్గడమూ.. ఇందుకు కారణమైంది.
flowers price increasing about of shravanam at kakaraparru in west godavari district