ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గ్రౌండ్ రిపోర్ట్: గట్లకు గండ్లు... గ్రామాల్లోకి వరద నీరు - గోదావరికి వరదలు

గోదావరి మహోగ్రరూపం దాల్చింది. గత ఐదు దశాబ్దాల్లో ఇంత భారీగా వరద రావడం ఇది నాలుగోసారి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని చాలా లంక గ్రామాలు జలదిగ్బంధంలోనే కొనసాగుతున్నాయి. అయితే గట్లు బలహీనపడటంతో పోలవరం చుట్టు పక్కాల గ్రామాల్లోకి వరదనీరు భారీగా చేరుతోంది. క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులపై ఈటీవీ భారత్​ ప్రతినిధి వివరాలు అందిస్తారు.

flood water enterd in polavaram village
flood water enterd in polavaram village

By

Published : Aug 18, 2020, 5:29 PM IST

పోలవరం నుంచి ఈటీవీ భారత్​ ప్రతినిధి

గోదావరికి వరద పోటెత్తుతోంది. ఎగువన కొంత వరద తగ్గముఖం పట్టినా.. రేపటి వరకు పశ్చిమగోదావరి జిల్లాలో వరద కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాలో పలు గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలో ఉన్నాయి. పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు.

వరద ఉధృతికి పోలవరంతో పాటు పరిసర ప్రాంతాలు జలసమంగా మారుతున్నాయి. నెక్లెస్ బాండ్ గట్ట నుంచి వరదనీరు పాత పోలవరంలోకి వెళుతోంది. గట్టుకు తూరలు ఏర్పడగా.. మూడు చోట్ల ఇసుక బస్తాలు వేశారు. వరద నీటిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details