ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొత్త అల్లుడికి కళ్లు చెదిరే విందు.. ... ఏకంగా 173 రకాల వంటకాలతో..! - Guest etiquette

173 types of recipes: 100 రకాల వంటకాలతో భోజనం చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి.. వామ్మో అన్ని రకాలా అనుకుంటున్నారా... కాని ఒక వ్యక్తి తమ అల్లుడికి ఏకంగా 173 రకాల వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేసాడంటే మామూలు విషయం కాదండోయ్ ఇంతకీ.. ఇది ఎక్కడా అనుకుంటున్నారా.. ఎక్కడో కాదండీ బాబోయ్.. మర్యాదలకు పెట్టింది పేరైన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోనే...

173 types of recipes
కొత్త అల్లుడికి కళ్లు చెదిరే విందు.. ... ఏకంకా 173 రకాల వంటకాలతో..!

By

Published : Jan 14, 2023, 9:57 PM IST

కొత్త అల్లుడికి కళ్లు చెదిరే విందు.. ... ఏకంకా 173 రకాల వంటకాలతో..!

173 types of recipes: అతిథి మర్యాదలకు పెట్టింది పేరైన గోదావరి జిల్లాల్లో.... కొత్త అల్లుడు ఇంటికి వస్తే ఆ హడావుడి మామూలుగా ఉండదు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఏకంగా 173 రకాల వంటకాలతో అత్త మామలు... కొత్త అల్లుడికి విందు భోజనం వడ్డించారు. వ్యాపారవేత్త తటవర్తి బద్రి, సంధ్య దంపతులు...ఇటీవల తమ కుమార్తె హారికను పృధ్వీ గుప్తాకు ఇచ్చి వివాహం చేశారు. పండగ సందర్భంగా కొత్త అల్లుడు ఇంటికి రావడంతో.... 173 రకాల వంటకాలతో భోజనం వడ్డించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

ABOUT THE AUTHOR

...view details