మద్యం మత్తులో గొడవ.. తండ్రి ప్రాణం తీసిన కొడుకు పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం దర్భగూడెంలో కుమారుడే కన్నతండ్రిని హతమార్చిన ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బత్తుల ప్రసాదరావు తరచూ మద్యం సేవించి కుటుంబ సభ్యులతో గొడవ పడుతుండేవాడు. శుక్రవారం సాయంత్రం కూడా అలానే మద్యం సేవించి పెద్ద కుమారుడు వీరభద్రస్వామితో ఘర్షణకు దిగాడు. చిన్నగా మొదలైన గొడవ పెద్దదైంది. కోపం ఆపుకోలేకపోయిన వీరభద్రస్వామి రోకలిబండతో తండ్రి తలపై గట్టిగా మోదాడు. తీవ్రగాయమైన ప్రసాదరావు అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే కొడుకు పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చదవండి..