వైకాపా నేతల కోసం విత్తన పంపిణీ ఆలస్యం...! - seeds
రైతులకు విత్తన పంపిణీ కార్యక్రమం వివాదంగా మారింది. గంటన్నర ఆలస్యం కావటంపై స్థానిక ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారపార్టీ నేతలు వస్తారని అధికారులు తెలిపారు.
seeds
పశ్చిమగోదావరిజిల్లా పోడూరులో వరదబాధిత రైతులకు విత్తన పంపిణీ వివాదమైంది.విత్తన పంపిణీ ప్రారంభానికి వచ్చిన అధికారపార్టీ నేతలు...తాము లేకుండా సరఫరా ఎలా చేస్తారని వాగ్వాదానికి దిగారు.ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్న రైతులకు విత్తన పంపిణీ చేయాలని స్థానిక ఎమ్మెల్యే రామానాయుడు అధికారులను సూచించారు.వైకాపా నేతలు రావాలని అధికారులు చెప్పటంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.తర్వాత వచ్చిన వైకాపా నేతలు సైతం వాగ్వాదానికి దిగారు.