ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతన్నలు

By

Published : Mar 11, 2020, 12:13 PM IST

దేశానికి అన్నం పెట్టే రైతన్న విత్తు నాటిన నాటి నుంచి.. పంటను విక్రయించే వరకు అన్ని దశల్లోనూ పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం మోగల్లు గ్రామంలో రైతులు రోడ్డెక్కారు. పంట పండించేందుకు సాగు నీరు లేక.. పురుగుల మందు చేతబూని చావే శరణ్యమంటున్నారు.

farmer protest for Irrigated water
సాగుకు నీరు లేక రోడ్డెక్కిన మోగల్లు గ్రామం రైతులు

సాగుకు నీరు లేక రోడ్డెక్కిన మోగల్లు గ్రామం రైతులు

సాగు నీటికై రైతుల ఆందోళన..
నాగలి పట్టి పంట పండించాల్సిన రైతన్న పురుగు మందుల డబ్బా చేతబూని చావే శరణ్యమంటున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం మోగల్లు గ్రామంలో గత నెల రోజులుగా సాగునీటి సరఫరా లేకపోవడం వల్ల రైతన్నలు రోడ్డుపై బైఠాయించి ఆందోళనలు చేపట్టారు. వరి సాగుకు సక్రమంగా నీరు అందించాలని ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోకపోవడం లేదని ఆరోపించారు. భీమవరం తణుకు రహదారిపై టెంట్ వేసి పురుగు మందుల డబ్బాలు చేతబూని ఆందోళన నిర్వహించారు.

అధికారులను నిలదీసిన రైతులు..
సాగుకు నీరు ఇవ్వండి.. రైతులను ఆదుకోండి అంటూ రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జలవనరుల శాఖ ఏఈ అనిల్ తేజ, మండల వ్యవసాయ శాఖ అధికారి నారాయణరావులను నీటి విడుదలలో అధికారుల నిర్లక్ష్యంపై ప్రశ్నించారు. పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేస్తామని జలవనరుల శాఖ డీఈ రవీంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రైతులు ఆందోళన విరమించారు. ప్రతి ఏటా ఎదురవుతున్న.. సాగునీటి సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.

ఇవీ చూడండి...

మనసులో స్థానం.. ఇంట్లోనూ సగభాగం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details