పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం వేములవీధికి చెందిన విశ్రాంత ఉద్యోగి నరసింహారావుకు.. రైల్వే ప్రయాణం చేదు అనుభవం మిగిల్చింది. తన కుమారుడిని కలిసేందుకు గత నెల 31న నరసాపురం - హైదరాబాద్ రైలులో బయల్దేరిన ఆయన.. అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడ్డారు. రైలు కాసేపట్లో సికింద్రాబాద్ చేరుకునే సమయంలో... శౌచాలయానికి వెళ్లి అక్కడే కళ్లు తిరిగిపడిపోయారు. ఎంతసేపటికీ లేవలేకపోయారు. లోన తలుపు గడియ పెట్టి ఉన్న కారణంగా.. ప్రయాణికులకు, సిబ్బందికి ఎవరికీ అనుమానం రాలేదు. ఇంతలో.. హైదరాబాద్ చేరుకుంది. అక్కడి నుంచి ఈనెల 1న రైలు నరసాపురానికి బయల్దేరింది. 2న సిబ్బంది.. శౌచాలయాన్ని శుభ్రం చేయడానికి ప్రయత్నించగా.. ఎంతసేపటికీ తలుపు తెరుచుకోలేదు. అనుమానంతో.. తలుపు గ్లాస్ పగలగొట్టి లోనికి చూడగా.. అపస్మారక స్థితిలో పడిఉన్న నరసింహారావును గుర్తించారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా ప్రాణాపాయంతో ఆయన బయటపడ్డారు. ఫోన్ లోని సమాచారం ఆధారంగా.. నరసింహారావు కుమారుడికి సమాచారం ఇచ్చారు. ఆ వెంటనే.. కుటుంబీకులు వచ్చి నరసింహారావును మెరుగైన చికిత్స నిమిత్తం మరో ఆసుపత్రికి తరలించారు. 30 గంటలపాటు రైల్వే సిబ్బంది ప్రదర్శించిన నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని బాధితుడు ఆవేదన చెందారు.
కళ్లు తిరిగిపడిపోయాడు... 30 గంటల తర్వాత..???
రైలులో ఓ ప్రయాణికుడు శౌచాలయంలో కళ్లు తిరిగిపోయాడు. రైలు గమ్యస్థానం దాటి.. మెయింటెనెన్సుకూ వెళ్లింది. 30 గంటల తర్వాత అచేతనంగా పడి ఉన్న ఆ వ్యక్తిని గుర్తించారు.
బాత్ రూంలో కళ్లు తిరిగిపడియాడు... 30 గంటల తర్వాత తేరుకున్నాడు