ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'కాపు నేస్తం కాదు... కాపు దగా పథకం'

By

Published : Jun 25, 2020, 6:22 AM IST

రాష్ట్ర ప్రభుత్వం కాపు నేస్తం పేరుతో కాపు దగా పథకానికి శ్రీకారం చుట్టిందని పశ్చిమగోదావరి జిల్లా తణుకు మాజీ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అర్హులందరికీ ఇవ్వకుండా అరకొరగా సాయం అందజేశారని ధ్వజమెత్తారు.

west godavari district
'కాపు నేస్తం.. కాపు దగా పథకం'

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కాపు నేస్తం దగా పథకమనితణుకు మాజీఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆరోపించారు. నియోజకవర్గంలోని వేల్పూరు గ్రామంలోఆయన మాట్లాడారు. అర్హులైన మహిళలు లక్షల సంఖ్యలో ఉన్నా... కాపు నేస్తం పథకం ద్వారా రెండు లక్షల 35 వేల మందికి మాత్రమే సాయం అందజేశారని పేర్కొన్నారు. బడ్జెట్లో రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించినప్పటికీ అందులో సగం కూడా ఖర్చు చేయలేదని రాధాకృష్ణ వ్యాఖ్యానించారు.

గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కాపు కార్పోరేషన్ ఏర్పాటు చేసి... ఏడాదికి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించారని గుర్తుచేశారు. కాపు కార్పోరేషన్ ద్వారా లక్ష రూపాయల సబ్సిడీ కలిపి రెండు లక్షల రూపాయల రుణం, కాపు పేద విద్యార్థులు విదేశాలలో చదువుకోవడానికి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల వంతున ఇచ్చినట్టు వివరించారు. రిజర్వేషన్లు 5 శాతం కేటాయించిన విషయం గుర్తుచేశారు. గత ప్రభుత్వం హయాంలో కాపుల సంక్షేమం కోసం మూడు వేల ఒక వంద కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు వివరించారు.

ఇది చదవండి తల్లిని కోల్పోయిన యువతికి సీఐడీ అదనపు డీజీపీ చేయూత

ABOUT THE AUTHOR

...view details