పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్ లను... రామచంద్ర ఇంజినీరింగ్ కళాశాలకు తరలించారు. అక్కడ ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల్లో వాటిని భద్రపరచారు. కలెక్టర్, ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్, ఏలూరు పార్లమెంట్ పరిశీలకులు దేవదత్ శర్మ తదితరుల సమక్షంలో గదికి సీలు వేశారు. అనంతరం అధికారులు, రాజకీయ నాయకులు గదికి ఏర్పాటు చేసిన కాగితంపై సంతకాలు చేశారు.
స్ట్రాంగ్ రూముల్లో భద్రంగా దెందులూరు ఈవీఎంలు - దెందులూరు
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి ఈవీఎంలు, వీవీప్యాట్ లను రామచంద్ర ఇంజినీరింగ్ కళాశాలలోని స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు.
స్ట్రాంగ్ రూమ్ లో ఈవీఎంలు, వీవీప్యాట్ లు