పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయాలని... ఈనాడు, ఈటీవీ ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లాలోని శ్రీ సూర్య కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రాచీన కాలంలో వినాయక చవితి పండుగంటే... బంకమట్టితో విగ్రహాలు తయారు చేసే వారిని ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ బ్రహ్మాజీ తెలిపారు. విగ్రహాల తయారీలో ప్రస్తుతం ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వాడటం వల్ల జల కాలుష్యం ఏర్పడుతుందన్నారు. వాతావరణ సమతుల్యం దెబ్బతినకుండా ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను ప్రతిష్టించే విధంగా కృషి చేయాలని ఆయన సూచించారు. అనంతరం మట్టి వినాయక ప్రతిమలనే వినియోగిస్తామని ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు.
'మట్టి వినాయక ప్రతిమలనే వినియోగిస్తాం' - etv
పశ్చిమగోదావరి జిల్లాలోని శ్రీ సూర్య కళాశాలలో ఈనాడు, ఈటీవీ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలు వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మట్టి విగ్రహాల వినియోగంతో...పర్యావరణానికి కలిగే ప్రయోజనాలను కళాశాల కరస్పాండెంట్ విద్యార్థులకు వివరించారు.
ఈనాడు, ఈటీవీ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలు వినియోగంపై అవగాహన కార్యక్రమం