ఇద్దరు అరెస్ట్... ఎనిమిది ద్విచక్రవాహనాలు స్వాధీనం - పెనుగొండ
వరుస చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఎనిమిది ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
ఇద్దరు అరెస్ట్... ఎనిమిది ద్విచక్రవాహనాలు స్వాధీనం
పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం దొంగరావిపాలెం వద్ద ఇద్దరు అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీుసులు అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి ఎనిమిది ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. తణుకు పరిసర ప్రాంతాలకు చెందిన ద్విచక్ర వాహనాలను అపహరించి విక్రయించటానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు వారిని పట్టుకున్నారు. నిందితులను తణుకు కోర్టులో హాజరు పరుస్తామని పెనుగొండ సీఐ విజయకుమార్ తెలిపారు.