ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వాట్సాప్​ మెసేజ్​తో నకిలీ ఏజెంటు అరెస్ట్​ - mogalturu

గల్ఫ్ దేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మహిళను మోసం చేస్తున్నటువంటి నకిలీ ఏజెంటును పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఏలూరు పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్  వివరాలను వెల్లడించారు.

వాట్సాప్​ మెసేజ్​తో నకిలీ ఏజెంటు అరెస్ట్​

By

Published : Aug 19, 2019, 6:00 PM IST

వాట్సాప్​ మెసేజ్​తో నకిలీ ఏజెంటు అరెస్ట్​

ఓ వాట్సప్ మెసేజ్ వైరల్ అయ్యింది. గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాల ఆశ చూపుతూ.. ఓ నకిలీ ఏజెంటు చేస్తున్న మోసాలను బయటపెట్టింది. బాధిత మహిళ పంపిన ఆ సందేశం.. మరింత మంది మహిళలను కాపాడింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ఉదంతం వెలుగుచూసింది. జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం... ఘటన వివరాలు ఇవి.

దుబాయ్​లో పడుతున్న వెతల నుంచి తమను రక్షించాలని తెలుగు మహిళలలు వాట్సప్ మెసేజ్ చేశారు. వైరల్ అయిన ఈ మెసేజ్ పై పోలీసులు దృష్టి పెట్టారు. విచారణలో నకిలీ ఏజెంట్... పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన దొండ వెంకట సుబ్బారావు వ్యవహారం బయటపడింది. ఇతడే.. మాయమాటలతో మోసం చేస్తూ... మహిళలను దుబాయ్ పంపినట్లు తేలింది.

గల్ఫ్​ దేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తామని మహిళలను నమ్మించి లక్షలాది రూపాయలను వసూలు చేశాడు సుబ్బారావు. మొగల్తూరుకు చెందిన నాగలక్ష్మి అనే మహిళకు నర్స్ ఉద్యోగం ఇప్పిస్తానని ఆశచూపాడు. ఆమెతో లక్ష రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. జూలై 14న ఆమెను శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్ పంపించాడు. దుబాయ్​ చేరాక రెండు వారాల పాటు అక్కడే నాగలక్ష్మి వేచి చూసింది. తను మోసపోయానని గ్రహించింది. తనలాగే మరో ఐదుగురు మహిళలు ఉన్నారన్న నిజాన్ని తెలుసుకుంది. అంతా కలిసి భారత రాయబార కార్యాలయానికి వెళ్లి తమ గోడు తెలిపారు. తక్షణమే వారికి రిటర్న్ పాస్​పోర్టు ఇప్పించిన అధికారులు... వారి ఊళ్లకు పంపించారు. సొంతూరుకు చేరిన నాగలక్ష్మి.. సుబ్బారావు చేసిన మోసంపై మొగల్తూరు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదే.. నకిలీ ఏజెంటును కటకటాలపాలు చేసింది.

ఏజెంట్లకు అవగాహన సదస్సు కల్పిస్తాం...

జిల్లాలోని టి.నర్సాపురం, మొగల్తూరుతో పాటు రాష్ట్రంలో ఇలాంటి కేసులు మరో రెండు నమోదయ్యాయని జిల్లా ఎస్పీ తెలుసుకున్నారు. ఇదే కాకుండా స్పెషల్ బ్రాంచ్ నుంచి సేకరించిన సమాచారం మేరకు రాష్ట్రవ్యాప్తంగా 425 లైసెన్స్ లేని ఏజెంట్లు ఉన్నారని గుర్తించామన్నారు. వీరందరికీ ఆయా పరిధిలోని అధికారులతో అవగాహన కల్పించి హెచ్చరికలు జారీ చేస్తామని తెలిపారు.

ఇదీ చదవండి:

భీమవరంలో భారీ కుంభకోణం.. బ్యాంకులకు 370 కోట్లు ఎగవేత

ABOUT THE AUTHOR

...view details