పశ్చిమగోదావరి జిల్లాలో ఎన్నికలు జరుగనున్న నిడదవోలు, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం, నరసాపురం పట్టణాల్లో పోలింగ్ సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. వార్డులు, డివిజన్ల వారీగా కౌంటర్లు ఏర్పాటు చేసి ఎన్నికల నిర్వహణ సిబ్బందికి సామగ్రిని అందజేశారు. మొత్తం 111 వార్డుల్లో.. 16 ఏకగ్రీవం కాగా..95 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
ఎన్నికల నిర్వహణ సిబ్బందికి పోలింగ్ సామాగ్రి పంపిణీ - Distribution of polling material latest news
పశ్చిమగోదావరి జిల్లాలోని ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ సామాగ్రి పంపిణీ ప్రారంభించారు. సామాగ్రి తీసుకున్న సిబ్బంది వాటిని పరిశీలించుకుని పోలింగ్ కేంద్రాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.
తొంభై ఐదు వార్డుల్లో 250కి పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ సామాగ్రి అందుకున్న సిబ్బంది పూర్తి స్థాయిలో పరిశీలించుకుని పోలింగ్ కేంద్రాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. దీంతో ఎన్నికల నిర్వహణకు అవసరమైన పత్రాలు, బ్యాలెట్ బాక్సుల పనితీరు తదితర అంశాలను పరీక్షించే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. పోలింగ్ సజావుగా సాగేందుకు అవసరమైన అన్నీ ఏర్పాట్లు చేశామని అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి:ప్రలోభాల పర్వం.. డబ్బులు పంపిణీ చేస్తున్న వీడియో వైరల్