ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లారీల నుంచి డీజిల్ చోరీ... వ్యక్తి అరెస్టు - thief arrested in thanuku

పశ్చిమగోదావరి జిల్లా తణుకు పరిసర ప్రాంతాల్లోని లారీల నుంచి డీజిల్​ను దొంగిలిస్తున్న వ్యక్తిని తణుకు పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి ఒక టాటా సఫారీ వాహనం, 17 ఖాళీ డీజిల్ డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు.

diesel-thief-arrested-in-thanuku
డీజిల్ చోరీ చేస్తున్న వ్యక్తి అరెస్టు

By

Published : May 1, 2021, 9:03 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు తూర్పువీధికి చెందిన రామెళ్ల రామకృష్ణ... కొంతకాలంగా తణుకు పరిసర ప్రాంతాల్లో నిలిపి ఉంచిన లారీల నుంచి డీజిల్​ను దొంగిలిస్తున్నాడు. ఈ ఘటనపై లారీ యజమానుల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిఘా పెట్టి రామకృష్ణను పట్టుకున్నారు.

అతని నుంచి ఓ టాటా సఫారి వాహనం, 17ఖాళీ డీజిల్ డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. రామకృష్ణకు సహకరించిన విజయవాడకు చెందిన రాజేష్, ఏలూరుకు చెందిన రవితేజపైనా పోలీసులు కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details