ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలవరంలో డయాఫ్రాం వాల్ నిర్మాణ పనులు ప్రారంభం

పోలవరం ప్రాజెక్టులో దిగువ కాఫర్ డ్యామ్ నిర్మాణంలో కీలకమైన డయాఫ్రాం వాల్ నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. 96 మీటర్ల పొడవు, 10 మీటర్ల లోతున 1.2 మీటర్ల వెడల్పుతో ఢయాఫ్రాం వాల్ నిర్మాణ పనులను మేఘా ఇంజినీరింగ్ సంస్థ ప్రారంభించింది.

By

Published : Aug 9, 2021, 5:32 PM IST

పోలవరంలో డయాఫ్రాం వాల్ నిర్మాణ పనులు ప్రారంభం
పోలవరంలో డయాఫ్రాం వాల్ నిర్మాణ పనులు ప్రారంభం

పోలవరం ప్రాజెక్టులో దిగువ కాఫర్ డ్యామ్ నిర్మాణంలో కీలకమైన డయాఫ్రాం వాల్ నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. 96 మీటర్ల పొడవు, 10 మీటర్ల లోతున 1.2 మీటర్ల వెడల్పుతో ఢయాఫ్రాం వాల్ నిర్మాణ పనులను మేఘా ఇంజినీరింగ్ సంస్థ ప్రారంభించింది. మొత్తంగా దిగువ వైపు ప్రవాహాన్ని నిలువరించేందుకు 1.613 మీటర్ల పొడవుతో 30.5 మీటర్ల ఎత్తుతో దిగువ కాఫర్ డ్యామ్ నిర్మాణాన్ని జలవనరుల శాఖ చేపట్టనుంది.

ఇప్పటికే దిగువ కాఫర్ డ్యామ్ లో 63000 క్యూబిక్ మీటర్ల రాక్ ఫిల్లింగ్ పనులు పూర్తి అయ్యాయి. దిగువ కాఫర్ ఢ్యాం దగ్గర నదిలో గ్యాప్ లను పూడ్చేందుకు కాంట్రాక్టు సంస్థ పనులు చేపట్టింది. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ ల నిర్మాణం అనంతరం పోలవరం ప్రాజక్టులో కీలకమైన ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details