పశ్చిమగోదావరి జిల్లాలో ఉదయం నుంచి ఎడితెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పంట కాలువల్లో ఉన్న నీటికి వర్షం నీరు తోడు కావటంతో పలు కాలువలకు గండిపడింది. పోడూరు మండలం మినిమించలపాడు సమీపంలోని చెంచునాడు కాలువకు గండిపడింది. కాలువనీరు ఒక్కసారిగా ఆయకట్టులోకి ప్రవహించటంతో సుమారు వంద ఎకరాల్లో వరినాట్లు నీట మునిగాయి. దాదాపు 350 ఎకరాల ఆయకట్టుకు ఇబ్బంది కలిగింది. గండిని పూడ్చడానికి రైతులు శతవిధాల ప్రయత్నించినా సాధ్యపడలేదు. గండిపూడ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
చెంచునాడు కాలువకు గండి..నీట మునిగిన పంట పొలాలు - పశ్చిమగోదావరిజిల్లా
పశ్చిమగోదావరి జిల్లాలో కురిసిన వర్షానికి పంట పోలాలన్నీ జలమయమయ్యాయి. వంద ఎకరాల్లో వరినాట్లు నీట మునిగాయి.
పశ్చిమగోదావరిలో భారీ వర్షం...పోలాలన్నీ జలమయం
TAGGED:
పశ్చిమగోదావరిజిల్లా