పోలవరం నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా గ్రామాల నుంచి ప్రజలను బయటకు పంపడాన్ని నిరసిస్తూ.. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు తక్షణం న్యాయం చేయాలని నినాదాలు చేశారు.
ఎలాంటి పునరావాస కార్యక్రమాలు చేపట్టకుండానే నిర్వాసితులను గ్రామాలు ఖాళీ చేయించడం హేయమైన చర్య అని సీపీఎం నాయకులు పేర్కొన్నారు. వారికి పూర్తి పరిహారం, పునరావాసం అందించాలని వారు డిమాండ్ చేశారు.