పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 56కు చేరుకుంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటివరకు వైరస్ నుంచి కోలుకుని 18 మంది డిశ్చార్జ్ కాగా.. 38మంది చికిత్స పొందుతున్నారు. జిల్లాలో ఏలూరు17, పెనుగొండ 15, తాడేపల్లిగూడెం 5, భీమవరం 5, పోలవరం 3, గుండుగొలను 3, కొవ్వూరు 2, ఉండి 2, ఆకివీడు 1, నరసాపురం 1, గోపాలపురం 1, టీ. నరసాపురంలో ఒక కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 28 మండలాల్లో రెడ్ జోన్లు ఏర్పాటు చేశారు.
పశ్చిమగోదావరి జిల్లాలో 56 పాజిటివ్ కేసులు - పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా వార్తలు
పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 56కు చేరుకుంది. ఇప్పటివరకు వైరస్ నుంచి కోలుకుని 18 మంది డిశ్చార్జ్ కాగా.. 38మంది చికిత్స పొందుతున్నారు. 28 మండలాల్లో రెడ్ జోన్లు ఏర్పాటు చేశారు.
పశ్చిమగోదావరి జిల్లాలో 56 పాజిటివ్ కేసులు